Etela Rajender : ఒక్క హామీ అయినా నెరవేర్చావా రేవంత్‌ : ఈటెల

Qubetvnews - April 27, 2024 / 06:47 AM IST

Etela Rajender : ఒక్క హామీ అయినా నెరవేర్చావా రేవంత్‌ : ఈటెల

Etela Rajender :

మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జవహర్ నగర్ కార్పొరేషన్, దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీలలో రోడ్ షో నిర్వహించారు. ఈటెల రోడ్‌ షో లో భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొనడంతో పాటు సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరు అయ్యి ఈటెలకు మద్దతు తెలిపారు. వేలాది మంది స్వచ్చందంగా తరలి వచ్చి ఈటెల రాజేందర్ రోడ్డు షో లో పాల్గొన్నారు. రోడ్డు షో లో ఈటెల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పై మరియు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. అధికారం ను దక్కించుకోవడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిన రేవంత్‌ రెడ్డి ఇప్పుడు మాత్రం వాటిని అమలు చేసేందుకు మొహం చాటేస్తున్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు మరియు వృద్దులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాను అంటూ రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. మీకు ఏమైన సంక్షేమ పథకాలు అందుతున్నాయా అంటూ జనాలను ఈటెల ప్రశ్నించిన సమయంలో లేదు అంటూ జనాలు గట్టిగా అరిచారు. అభివృద్ది విషయంలో రాష్ట్రంను మరింత వెనక్కి తీసుకు వెళ్లే విధంగా రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఉంటున్నాయి అంటూ ఈటెల ఆరోపించారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినా ఇప్పటి వరకు హామీల అమలు విషయంలో మొహం చాటేస్తూ ఉన్నారని ఈటెల పేర్కొన్నారు.

మల్కాజ్‌గిరి నియోజక వర్గంను దేశంలోనే నెంబర్‌ 1 నియోజక వర్గంగా అభివృది చేయడం కోసం బీజేపీకి ఓటు వేసి నన్ను గెలిపించండి అంటూ ఈటెల ఓటర్లకు విజ్ఞప్తి చేశాడు. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి దేశానికి ప్రధాని అయితే మరిన్ని విప్లవాత్మక మార్పులు వస్తాయి అని, అమెరికా వంటి పాశ్చ్యాత్య దేశాలతో పోటీ పడి ఇండియా అభవృద్దిలో దూసుకు పోవాలి అంటే కచ్చితంగా ప్రధానిగా మోడీ మూడోసారి ఎంపిక అవ్వాల్సిన అవసరం ఉందని ఈటెల ప్రజలకు వివరించారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News