Pawan Kalyan : టీడీపీకి మండిపోయేలా చేసిన పవన్.. ఇదేం స్టేట్ మెంట్..!

Qubetvnews - February 21, 2024 / 07:52 PM IST

Pawan Kalyan : టీడీపీకి మండిపోయేలా చేసిన పవన్.. ఇదేం స్టేట్ మెంట్..!

Pawan Kalyan :

పవన్ కల్యాణ్‌ ఓ పట్టాన ఓ మాట మీద ఉండరనేది అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఎలాంటి స్టేట్ మెంట్ ఇస్తాడో.. ఎప్పుడు ఎవరిని దగ్గరకు తీసుకుంటాడో.. ఎప్పుడు ఎవరి పంచన చేరుతాడో కూడా చెప్పలేమని ఏపీ జనాలే చెబుతున్నారు. ఇక పవన్ కల్యాణ్ ఇప్పుడు టీడీపీతో పొత్తులు పెట్టుకున్నారు. అయితే ఈ టీడీపీ పొత్తులు పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీ గానీ.. ఇటు జనసేన గానీ ఒక్క తాటిమీదకు ఇప్పటి వరకు రాలేదంటేనే అసలు వీరి పొత్తులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు రోజుకో చిచ్చు రాజుకుంటోంది.

ఇంకా అభ్యర్థులను కూడా ఉమ్మడిగా ప్రకటించకుండానే.. టీడీపీ మీద జనసేన.. జనసేన మీద టీడీపీ రగిలిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా పవన్ చేసిన స్టేట్ మెంట్ టీడీపీకి మండిపోయేలా చేస్తోంది. అదేంటంటే.. తాజాగా తూర్పు గోదావరి జిల్లాల నేతలతో పవన్ కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం ఒంటరిగా పోటీ చేస్తే 40 సీట్లలో గెలుస్తామని.. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీతో పొత్తులు పెట్టుకున్నామని చెబుతున్నారు. దాంతో ఇప్పుడు ఈ స్టేట్ మెంట్ కాస్తా టీడీపీకి రగిలిపోయేలా చేస్తోంది. ఎందుకంటే అసలు ఒంటరిగా పోటీ చేసేంత బలం జనసేనకు ఉందా అని టీడీపీ నేతలు అడుగుతున్నారు.

గత ఎన్నికల్లో కమ్యూనిష్టు పార్టీలతో పొత్తులు పెట్టుకుని పోటీ చేసిన పవన్.. రెండు చోట్లా ఓడిపోతే.. ఆయన పార్టీ తరఫున ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. ఇదీ జనసేన బలం. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే కనీసం పవన్ కల్యాణ్‌ కూడా గెలుస్తాడో లేదో అనే భయం ఉందని.. అందుకే టీడీపీతో పొత్తులు పెట్టుకున్నాడనేది తెలుగు దేశం నేతల వాదన. తమ పార్టీ పంచన చేరి.. తమ మద్దతుతో గెలిచేందుకు పవన్ సన్నాహాలు చేసుకుంటూ.. ఇలా తమను తక్కువ చేసి మాట్లాడటం ఏంటని మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. పవన్ కల్యాణ్‌ కు నిజంగా అంత సీన్ ఉంటే ఒంటరిగానే పోటీ చేసుకోమని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు తమ్ముళ్లు.

పవన్ కల్యాణ్‌ పార్టీకి అసలు ఒంటరిగా పోటీ చేస్తే కనీసం పది సీట్లయినా వస్తాయా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. తమ పార్టీ వదిలేసిన సీట్లలో పోటీ చేసి ఎంతో కొంత గెలవాలని ఆరాటపడుతున్న జనసేన.. ఇలాంటి ప్రకటనలు చేస్తే అది టీడీపీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టే అంటున్నారు.

దీంతో పవన్ కల్యాణ్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై చంద్రబాబుకు ఒత్తిడి పెరుగుతోంది. పవన్ ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే.. అది టీడీపీ ఇమేజ్ ను దెబ్బ తీస్తుందని చెబుతున్నారంట. మొత్తానికి ఇప్పుడే ఇలాంటి రగడ ఉంటే.. ఇంక సీట్లు ప్రకటన చేస్తే ఇంకెలా ఉంటుందో అని అంటున్నారు రాజకీయ నిపుణులు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News