Pawan Kalyan : సింపతీ గేమ్ ఎందుకు పవన్.. నేరుగా గెలిచేంత సీన్ లేదా..?

Qubetvnews - February 29, 2024 / 03:38 PM IST

Pawan Kalyan : సింపతీ గేమ్ ఎందుకు పవన్.. నేరుగా గెలిచేంత సీన్ లేదా..?

Pawan Kalyan :

పవన్ కల్యాణ్‌ పార్టీ పెట్టి పదేండ్లు దాటిపోతోంది. కానీ ఇంకా అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. గత ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేస్తే.. ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. దాంతో ఈ సారి ఎలాగైనా కనీసం తానైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. ఈ సారి గనక గెలవకపోతే ఇక తనకు రాజకీయ భవిష్యత్ ఉండదని పవన్ కు కూడా తెలుసు. అందుకే ఈ సారి ఎలాగైనా గెలిచేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా సరే వదిలిపెట్టట్లేదు. ఇందులో భాగంగా తన సిద్ధాంతాలను, తాను గతంలో పార్టీ పెట్టినప్పుడు చెప్పిన మాటలను కూడా పక్కన పెట్టేస్తున్నాడు.

మార్పు, కొత్త రాజకీయాలు అంటూ డైలాగులు పేల్చిన పవన్.. ఇప్పుడు మాత్రం గెలుపే పరమావవధి అన్నట్టు అడ్డదార్లు తొక్కుతున్నాడని వైసీపీ పదే పదే ఆరోపిస్తోంది. ఇందుకు తగ్గట్టే పవన్ కూడా కొన్ని పనులు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటికే టీడీపీతో పొత్తులు పెట్టుకున్నారు. అయితే ఇది సరిపోదని భావిస్తున్నారు కాబోలు. నేరుగా ఎన్నికలకు వెళ్తే గెలవలేమని భావిస్తున్న పవన్ కల్యాణ్‌.. సింపతీ ప్రయోగాన్ని తెరమీదకు తెచ్చేశారు. గత రెండు రోజులుగా పవన్ కల్యాణ్‌ పార్టీ కోసం వంద కోట్ల ఆస్తులు అమ్ముకున్నాడంటూ జనసేన సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

పార్టీ కోసం పవన్ కల్యాణ్‌ ఆస్తులు అమ్ముకుంటున్నాడు కాబట్టి.. కార్యకర్తలు అందరూ పవన్ కోసం సపోర్ట్ చేయాలనే హిడెన్ మెసేజ్ ను గట్టిగానే ఇస్తున్నారు. ఇలా పవన్ కల్యాణ్‌ పార్టీని నడిపించడం కోసం తన ఆస్తులను కూడా అమ్ముకుని మరీ ప్రజల కోసం పోరాడుతున్నాడనే మెసేజ్ ఇచ్చి దానికి గట్టిగానే ప్రచారం కల్పించుకుంటున్నారు. ఇలాంటి ఫేక్ సింపతీ ప్రచారం వల్ల అటు కాపుల్లో సానుభూతిని పొందాలనే ప్లాన్ కూడా ఉందని టాక్ నడుస్తోంది. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. పిఠాపురంలో కాపు జనాభానే ఎక్కువగా ఉన్నారు.

కాబట్టి ఆ కాపు వర్గంలో ఎలాగైనా సింపతీ పెంచుకుని గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కల్యాణ్‌. దాంతో ఆయన సింపతీ రాజకీయాలపై వైసీపీ కౌంటర్లు వేస్తోంది. గెలవాలనే తపన ఉంటే ఇలా సింపతీ గేమ్ ఆడటం ఎందుకు అని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు.

పవన్ కల్యాణ్‌ కు నేరుగా గెలిచే సత్తా లేదని.. అందుకే ఇలా ప్రజలను మభ్య పెట్టేందుకు సింపతీ గేమ్ ఆడుతున్నాడంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు వైసీపీ శ్రేణులు. ఇలాంటి సింపతీ గేమ్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. దాన్ని తిప్పి కొడుతామని చెబుతున్నారు వైసీపీ నేతలు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News