Nara Lokesh : లోకేష్ పొరపాట్లు.. వైసీపీకి అస్త్రాలు..!
Qubetvnews - February 17, 2024 / 07:02 AM IST
Nara Lokesh :
ఈ నడుమ లోకేష్ కాస్త ఆవేశంలో ఏవేవో అనేస్తున్నారు. అయితే ఎంత ఆవేశంతో మాట్లాడినా సరే ఆ మాటలు చివరకు వైసీపీకి మేలు చేసే అంశాలుగానే ఉంటున్నాయి. కానీ లోకేష్ మాత్రం ఇలాంటి కామెంట్లు చేయడం, స్టేట్ మెంట్లు ఇవ్వడం మాత్రం అస్సలు ఆపట్లేదు. యువగళం తర్వాత మొన్నటి వరకు ఆయన నారా లోకేష్ ఎవరికీ కనిపించలేదు. ఇంటి వద్దనే ఉన్నారో ఇంకెక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు మళ్లీ జనాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా శంఖారావం పేరుతో సభలు పెట్టేస్తున్నారు.
అయితే ఆయన తాజాగా విజయనగరం సభలో మాట్లాడుతూ కొన్ని ప్రకటనలు చేసేశారు. జగన్ రుషికొండ మీద కట్టుకున్న ఇల్లును తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాభవన్ గా మారుస్తామని చెప్పారు. అయితే ఇక్కడే లోకేష్ పప్పులో కాలేశారని కొందరు రాజకీయ నేతలు అంటున్నారు. ఎందుకంటే జగన్ ఇప్పుడు విశాఖను రాజధానిగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ లోకేష్, టీడీపీ మొత్తం విశాఖను రాజధానిగా చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అలాంటిది ఇప్పుడు లోకేష్ మాత్రం జగన్ కడుతున్న ఇల్లును ప్రజాభవన్ గా మార్చేస్తామని చెబుతున్నారు.
ప్రజాభవన్ గా మార్చడం అంటే ఇక్కడి నుంచి సీఎం పరిపాలన చేయాల్సి ఉంటుంది. జగన్ కేవలం దాన్ని క్యాంప్ ఆఫీస్ గా మాత్రమే నిర్మించుకుంటున్నారు. కానీ ఇప్పుడు లోకేష్ వచ్చి దాన్ని ప్రజాభవన్ గా చేస్తామంటున్నారు. అంటే అప్పుడు సీఎం ఇక్కడే ఉండాలి. ప్రజలను కలుస్తూ వారి సమస్యలను పరిష్కరించాలి. అప్పుడు అది పరిపాలన రాజధాని అవుతుంది. అంటే విశాఖను రాజధానిగా చేయడానికి లోకేష్ ఒప్పుకున్నట్టే అవుతుందని అంటున్నారు వైసీపీ నేతలు. ఈ మాత్రం కూడా తెలియకుండానే లోకేష్ మాట్లాడుతున్నాడని హేలన చేస్తున్నారు వైసీపీ మంత్రులు.
లోకేష్ కు ఆ మాత్రం అవగాహన లేదా అని కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరేమో లోకేష్ కు మనసులో విశాఖను రాజధానిగా చేయడం ఓకేనేమో అన్నట్టు పోస్టులు పెడుతున్నారు. ఇలా మొత్తానికి లోకేష్ చేసిన ప్రకటన కాస్తా వైసీపీకి అస్త్రంగా మారిపోయిందంటున్నారు వైసీపీ నేతలు.

Nara Lokesh Announcement Become Weapon For YCP
జగన్ పరిపాలన రాజధానిగా విశాఖను చేస్తామంటే వ్యతిరేకించిన వారే ఇప్పుడు తిరిగి ఒప్పుకుంటున్నారని.. జగన్ పాలన అంటే ఇదే అని వైసీపీ నేతలు చెబుతున్నారు. దాంతో ఇప్పుడు టీడీపీలో చిచ్చు రేగిపోయింది. లోకేష్ ఇలాంటి లేనిపోని స్టేట్ మెంట్లు ఇస్తే అది పార్టీకే నష్టం అంటున్నారు ఆ పార్టీ నాయకులు.




