Nara Lokesh : లోకేష్ మతిలేని మాటలు.. ఆ విషయం మర్చిపోయాడా..!
Qubetvnews - February 19, 2024 / 01:23 PM IST
Nara Lokesh :
ఈ మధ్య నారా లోకేష్ చేస్తున్న కామెంట్లు కామెడీకి ఎక్కువ సీరియస్ ను కు తక్కువ అన్నట్టు ఉంటున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎందుకంటే నారా లోకేష్ చేస్తున్న కామెంట్లు కూడా అలాగే ఉంటున్నాయనుకోండి. కానీ లోకేష్ మాత్రం తన మీద ఎన్ని ట్రోల్స్, ఎన్ని విమర్శలు వచ్చినా సరే ఇలాంటి నోరు జారుడు మాటలను అస్సలు మానట్లేదు. గతంలో తనను తానే మూర్ఖుడిని ప్రకటించుకున్నారు. అంతే కాకుండా కులపిచ్చి, మతపిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉందా అది కేవలం టీడీపీ పార్టీ మాత్రమే చెప్పడం ఇంకా హాస్యాస్పదంగా ఉండేది.
అలా ఎప్పటికప్పుడు తన పరువు తానే తీసుకుంటున్నారని లోకేష్ మీద వైసీపీ సెటైర్లు వేస్తూనే వస్తోంది. ఈ క్రమంలోనే లోకేష్ శంకారావం పేరుతో చేస్తున్న కార్యక్రమంలో తాజాగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే జగన్ ఆస్తుల్ని జప్తు చేస్తామని చెప్పారు. ప్రజాధనం లక్షల కోట్లు లూటీ చేసి భారతీ సిమెంట్, పేపర్లు, టీవీ ఛానెళ్లు పెట్టుకున్నారని ఆరోపించారు. అంతే కాకుండా హైదరాబాద్, బెంగుళూరులో ప్యాలెస్ లు కూడా కట్టించుకున్నాడని.. అవన్నీ ప్రజాధనంతోనే కట్టుకున్నారని చెప్పడం ఇప్పుడు ఆయన విజ్ఞతకు నిదర్వనం కాబోలు.
వాటన్నింటినీ తాము అధికారంలోకి రాగానే జప్తు చేస్తామని.. ప్రజల ఆస్తులన్ని ప్రజలకే అప్పగిస్తామని చెబుతున్నారు. ఇది వినడానికి కూడా కాస్త విడ్డూరంగానే అనిపించింది. ఎందుకంటే లోకేష్ ఓ విషయం మర్చిపోతున్నారు. 2014 నుంచి 2019 వరకు ఏపీలో టీడీపీనే అధికారంలో ఉంది కదా. పైగా అప్పుడు ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా ఉన్నారు. మరి జప్తు చేయించాలి అనుకుంటే అప్పుడే జగన్ మీద చర్యలు తీసుకోవాలి కదా. ఒకవేళ జగన్ నిజంగానే ప్రజాధనాన్ని లూటీ చేస్తే అధికారంలో ఉన్న చంద్రబాబు ఊరుకునే వారా. ఏ తప్పు చేయకుండానే జగన్ మీద కేసులు పెట్టించిన చరిత్ర చంద్రబాబుకు ఉందని గుర్తు చేస్తున్నారు వైసీపీ నేతలు.
కాబట్టి జగన్ తప్పు చేస్తే చంద్రబాబు ఎలా ఊరకున్నాడని అడుగుతున్నారు. అంటే ఒకసారి అధికారంలో ఉన్నప్పుడు జగన్ ను ఏం చేయలేకపోయారు అంటే.. జగన్ తప్పు చేయలేదనే కదా అర్థం అంటున్నారు వైసీపీ కార్యకర్తలు, నేతలు. కాబట్టి ఇప్పుడు ఏదో నాలుగు ఓట్ల కోసం జగన్ మీద లేనిపోని బురద జల్లుతున్నారని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు.
ఇప్పట్లో జగన్ ను ఓడించడం కష్టం అని లోకేష్ కు తెలుసు. అందుకే ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారనేది లోకేష్ మీద వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు. గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఏ మాత్రం అభివృద్ధి చేయని వారు.. ఇప్పుడు అధికారం ఇస్తే ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.




