Nara Lokesh : ఇప్పుడు బీసీ వ్యూహం.. లోకేష్ కు మరో దెబ్బ తప్పదా..?

Qubetvnews - February 21, 2024 / 10:12 AM IST

Nara Lokesh : ఇప్పుడు బీసీ వ్యూహం.. లోకేష్ కు మరో దెబ్బ తప్పదా..?

Nara Lokesh :

నారా లోకేష్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి ఎమ్మెల్యేగా వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే టీడీపీ పెట్టినప్పటి నుంచి మంగళగిరి అసెంబ్లీ స్థానం ఆ పార్టీకి పెద్దగా కలిసి రాలేదు. అప్పట్లో ఎప్పుడు ఒకటి రెండు సార్లు మాత్రమే గెలిచింది. ఆ తర్వాత అక్కడ ఎన్నడూ టీడీపీ గెలవలేదు. అలాంటి స్థానం నుంచి లోకేష్ పోటీ చేయడమే ఓ పెద్ద రిస్క్. అనుకున్నట్టు గానే గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అది సరిపోలేదన్నట్టు ఇప్పుడు మరోసారి అక్కడి నుంచే పోటీ చేస్తానంటున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.

లోకేష్ ను ఓడగొట్టేందుకు వైసీపీ కూడా గట్టిగానే సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే పార్టీ నుంచి వెళ్లిపోయిన ఆళ్ల రామకృష్నారెడ్డిని తిరిగి పార్టీలోకి చేర్చుకుంది. వాస్తవానికి జగన్ ఇలా తన పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని తిరిగి రానివ్వరు. అంత త్వరగా వారిని అక్కున చేర్చుకోరు. కానీ ఇప్పుడు తన రూల్స్ ను పక్కన పెట్టేసి మరీ ఆర్కేను చేర్చుకున్నారంటే కేవలం లోకేష్ ను దృష్టిలో ఉంచుకుని మాత్రమే అంటున్నారు వైసీపీ నేతలు. ఇక ఆర్కే మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఓసీ చేతిలో ఓడిపోయిన నారా లోకేష్ ఈ సారి మాత్రం బీసీ చేతిలో ఓడిపోవడం ఖాయం అంటున్నారు.

ఇప్పుడు మంగళగిరి టికెట్ గంజి చిరంజీవికి జగన్ కేటాయించిన సంగతి తెలిసిందే. బీసీ నేతకు టికెట్ ఇచ్చామనే వ్యూహంతో ఈ సారి లోకేష్ ను మరో దెబ్బ కొట్టాలని జగన్ గట్టిగానే ప్లాన్ వేసుకున్నారు. అందుకే తనకు అత్యంత సన్నిహితుడు అయిన ఆర్కేను కాదని మరీ గంజి చిరంజీవికి టికెట్ కేటాయించుకున్నారు. బీసీ నేతపై అగ్ర కులానికి చెందిన లోకేష్ పోటీ చేస్తే ప్రజల్లో ఎంతో కొంత చర్చ జరుగుతుంది. బీసీ వైపు ప్రజలు నిలిచేందుకు అవకాశాలు ఉంటాయని అంటున్నారు జగన్. ఇక ఇప్పుడు గంజి చిరంజీవికి తోడు ఆ నియోజకవర్గంలో పట్టు ఉన్న ఆర్కే కూడా వచ్చాడు.

YCP Preparing To Defeat Nara Lokesh

YCP Preparing To Defeat Nara Lokesh

కాబట్టి ఈ సారి జగన్ ఎంచుకున్న బీసీ వ్యూహం గట్టిగానే లోకేష్ ను దెబ్బ కొట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు వైసీపీ నేతలు. ఇందులో భాగంగానే మంగళగిరిలో ఏది అవసరం అయితే అది కేటాయిస్తున్నారు. ఇప్పటికే పార్టీలోకి మంగళగిరిలో వలసలు కూడా బాగానే పెరుగుతున్నాయి.

కాబట్టి ఈ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి లోకేష్ ను అసెంబ్లీలో అడుగు పెట్టుకుండా చేయాలని జగన్ అనుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీకి కలిసొస్తున్న అంశాలను బట్టి చూస్తుంటే కచ్చితంగా ఈ ఎన్నికల్లో జగన్ మంగళగిరిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని అంటున్నారు. మరి జగన్ వ్యూహాలను లోకేష్ ఎలా ఎదుర్కుంటారనేది చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News