Pawan Kalyan : పవన్ కల్యాణ్ వల్ల స్టార్ అయిన ఇద్దరు హీరోలు.. ఎలా అంటే..?
Qubetvnews - February 17, 2024 / 08:24 AM IST
Pawan Kalyan :
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇప్పుడు టాలీవుడ్ లోనే అగ్ర హీరోగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం సినిమాలతో పాటు అటు రాజకీయాల్లో కూడా చాలా బిజీగా గడుపుతున్నాడు పవన్ కల్యాణ్. కాగా పవన్ కల్యాణ్ కెరీర్ లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాడు. ఎన్నో సినిమాలు ప్లాప్ అయినా సరే ఆయన ఇమేజ్ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు. రీసెంట్ గానే ఆయన బ్రో సినిమాతో పలకరించాడు. ఇప్పుడు వరుసగా సినిమాలను సెట్స్ మీద ఉంచాడు. ఇది కాసేపు పక్కన పెడితే.. పవన్ కల్యాణ్ వల్ల ఓ ఇద్దరు స్టార్ హీరోలు అయ్యారు. వారెవరో ఎలా అయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం.
పవన్ కల్యాణ్ వల్ల స్టార్ హీరోలు అయిన వారిలో ఒకరు మహేశ్ బాబు, రెండోది రవితేజ, మహేశ్ బాబును స్టార్ హీరోను చేసిన సినిమా పోకిరి. ఆ సినిమాతో ఒక్కసారిగా మహేశ్ బాబు ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. పోకిరి సినిమా అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాసింది. యూత్ లో విపరీతంగా మాస్ ఫాలోయంగ్ వచ్చేసింది మహేశ్ బాబుకు. అయితే పూరీ జగన్నాథ్ ఈ సినిమాలో ముందుగా పవన్ కల్యాణ్ ను అనుకున్నాడు. అనుకోవడమే కాకుండా పవన్ కల్యాణ్ కు కథ కూడా చెప్పేశాడు పూరీ జగన్నాథ్. కానీ అప్పటికే పవన్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి.
దాంతో ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేయాలనే టార్గెట్ కారణంగా పవన్ కల్యాణ్ పోకిరిని వదలుకున్నాడు. దాంతో అదే కథతో మహేశ్ బాబు సినిమా చేసి ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు. ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అతడు సినిమాను కూడా ముందు గా పవన్ కే చెప్పాడు. కానీ పవన్ ఆ సినిమాను కూడా వదులుకున్నాడు. దాంతో మహేశ్ బాబు ఆ సినిమాను చేసి మంచి హిట్ అందుకున్నాడు. అలా పవన్ వదులుకున్న రెండు సినిమాల కారణంగా మహేశ్ బాబు స్టార్ హీరో అయిపోయాడు. ఇక రవితేజ విషయంలో కూడా ఇదే జరిగింది.
రవితేజను ఓవర్ నైట్ స్టార్ హీరోను చేసిన మూవీ ఇడియట్. ఆ సినిమా అప్పట్లోనే కాదు.. ఇప్పటికీ ఓ సెన్సేషనే. యూత్ ను ఓ ఊపు ఊపేసింది ఆ సినిమా. కాగా ఈ కథను ముందుగా పవన్ కల్యాణ్ కు చెప్పాడు పూరీ జగన్నాథ్. కానీ ఎందుకో పవన్ అప్పటికే వరుసగా సినిమాలు ఉండటంతో ఆ సినిమా కథను రిజెక్ట్ చేశాడు.

Pawan Kalyan Rejected Two Blockbuster Movies
కానీ రవితేజ వదులుకోలేదు. మంచి హిట్ అయింది. అంతే కాకుండా యూత్ లో రవితేజకు మంచి క్రేజ్ ను తీసుకువచ్చింది ఆ సినిమా. దాంతో పాటు అప్పట్లో రవితేజకు మంచి హిట్ ఇచ్చిన అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి కథను కూడా ముందుగా పవన్ కే చెబితే అతను వదులుకున్నాడు. రవితేజ చేసి మంచి హిట్ కొట్టేశాడు. ఇలా పవన్ వదులుకున్న సినిమాలతో రవితేజ, మహేశ్ స్టార్ హీరోలు అయిపోయారు.





