Pawan Kalyan : పక్కవాడు సొంతంగా ఎదిగితే తొక్కేసి పైకొచ్చినట్టా పీకే? ఇంత కడుపుమంటా?

Qubetvnews - April 29, 2024 / 12:06 PM IST

Pawan Kalyan : పక్కవాడు సొంతంగా ఎదిగితే తొక్కేసి పైకొచ్చినట్టా పీకే? ఇంత కడుపుమంటా?

Pawan Kalyan :

ఎంత పాలిటిక్స్ లో ఉన్నా, ప్రత్యర్థి పార్టీ నేతలపై మాటలు అనాలన్నా కాస్త లాజిక్ ఉండాలి. అప్పుడే జనాలు వింటారు. అందులో నిజానిజాలేంటో ఆలోచిస్తారు. కానీ వ్యక్తిగత కోపాలతో, అవతలి వాళ్ల మీద కడుపుమంటతో చేసే విమర్శలను జనం హర్షించకపోగా, ఇదా నీ అసలు నైజం అంటూ అసహ్యించుకునే ఆస్కారం లేకపోలేదు. ప్రస్తుతం పవన్ తీరు చూసిన ప్రజలు ఆయన మీద అలాంటి అభిప్రాయంతోనే ఉన్నారు. పక్కవాడు ఎదిగితే కడుపుమంటతో చేసే కామెంట్స్ విని, నిందలు వేసే బుద్దిని చూసి రాజకీయాల్లోనే కాదు వ్యక్తిగతంగా కూడా పవన్ కి హుందాగా వ్యవహరించడం రాదంటూ విమర్శిస్తున్నారు విశ్లేషకులు.

ఏపీ మంత్రి కన్నబాబుపై ఉన్న కళ్లమంటని చాలా ఓపెన్ గానే చూయించుకున్నాడు పవన్. డొక్కు స్కూటర్ మీద తిరిగేవాడు, మా అన్న ఏదైనా సమాచారం అడిగితే తెచ్చిచ్చే వాడు. ఇవాళ అంచెలంచెలుగా అందరినీ తొక్కుతూ ఎదిగాడంటూ కన్నబాబుపై కామెంట్స్ చేశాడు వపన్. ఇందులో రాజకీయమైన విమర్శ కంటే వ్యక్తిగత కక్షే ఎక్కువగా కనిపిస్తోందంటూ అభిప్రాయపడుతున్నారు చాలా మంది. తన అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో సభ్యుడిగా ఉన్నప్పుడు కన్నబాబు తమ దగ్గ చేతులు కట్టుకుని ఉండేవాడు. పిలిస్తే పరిగెత్తుకు వచ్చేవాడు. కానీ ఇప్పుడు వైసీపీలో మంత్రయ్యాడు. తాను మాత్రం కనీసం ఎమ్మెల్యే కాకపోగా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. ఇదీ పవన్ కడుపుమంట.

అయినా అసలు కన్నబాబు ఎవరిని తొక్కి పైకొచ్చాడని పవన్ విమర్శిస్తునట్టు? ప్రజారాజ్యాన్ని ఆ పార్టీ అధినేత చిరంజీవే కాంగ్రెస్ లో కలిపేశాడు. దాంతో కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నాడు. ఆ తర్వాత చాలామంది కాంగ్రెస్ నేతల్లానే కన్నబాబు వైసీపీలో కొచ్చాడు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని ఎమ్మెల్యే అయ్యాడు. జగన్ చూరగొన్న విశ్వాసంతో మంత్రయ్యాడు. మరి ఇందులో అసలు తొక్కేయడం, నొక్కేయడం అనేది ఎందుకొచ్చినట్టు? పైగా కన్నబాబు అనే పార్టీ సభ్యుడే ప్రజారాజ్యాన్ని బలవంతంగా అమ్మేసేలా చేశాడంటూ మాట్లాడ్తున్న పవన్ మాటల్లో లాజిక్ ఏంటో ఎవరీకి అర్థం గాని మిలియన్ డాలర్ల ప్రశ్న.

అంతే కాదు.. గత ఐదేళ్లలో కన్నబాబు, చిరు ఇద్దరూ టచ్ లోనే ఉన్నారు. జగన్ కి, చిరంజీవికి కమ్యునేషన్ కన్నబాబే అని రాజకీయాల్లో ఉన్న కొందరికి కచ్చితంగా తెలుసు. మరి తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఈ మాత్రం కూడా తెలియదా అన్న కామెంట్స్ కూడా పవన్ తీరును తప్పుబడుతున్నాయి. మొత్తానికి పీకే మాటలతో క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తోంది ఏంటి అంటే.. తమ పార్టీలో పనివాడిగా ఉన్నవాడు అలాగే ఉండాలనే సంకుచిత మనస్తత్వం పవన్ ది. ప్రజలు వేసిన ఓట్లతో ఎమ్మెల్యే అయి, తన పనితనంతో మంత్రి అయినా కూడా.. కేవలం తనకు నచ్చని కారణంగా తొక్కేసి పైకిచ్చినట్టే. ఇలాంటి మనస్తత్వంతో ఉంటే రాజకీయాల్లో ఎదగడం తర్వాత.. సమాజం ద్రుష్టిలో మరింత దిగజారిపోవడం పక్కా అంటూ పవన్ మాటలిన్నవాళ్ళ బుద్ధిమాట.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News