Congress : ఆ విషయంలో బీఆర్ ఎస్ ను టార్గెట్ చేయబోతున్న కాంగ్రెస్..?
Qubetvnews - March 19, 2024 / 11:45 AM IST
Congress : కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో అప్పటి నుంచే బీఆర్ ఎస్ ను టార్గెట్ చేస్తోంది. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత్ గ్రాఫ్ మరింత పెంచుకోవడానికి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ ఎస్ ను అన్ని విషయాల్లో టార్గెట్ చేస్తూ ప్రజల్లో క్రేజ్ తెచ్చుకున్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. ఒక పార్టీకి ఆదరణ తగ్గుతోందంటే.. ఆటోమేటిక్ గా ఇంకో పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు బీఆర్ ఎస్, కాంగ్రెస్ విషయంలో కూడా ఇదే జరిగింది.
అయితే కాంగ్రెస్ లోకి బీఆర్ ఎస్ నుంచి వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ బాట పడుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ ఎస్ నుంచి అందరూ వెళ్లిపోతున్న వారే తప్ప చేరేవారు లేకుండా పోతున్నారు. ఇలాంటి సమయంలో బీఆర్ ఎస్ లోకి కీలక నేత వచ్చి చేరారు. ఆయనే ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. బీఎస్పీ అధినేతగా ఉన్న ప్రవీణ్ కుమార్.. అకస్మాత్తుగా బీఆర్ ఎస్ లో చేరిపోయారు. ప్రవీణ్ రాకతో బీఆర్ ఎస్ కు గ్రాఫ్ పెరుగుతుందని కేసీఆర్ అనుకుంటున్నారు. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ టార్గెట్ చేయడానికి రెడీ అవుతోంది.
కాగా ఇప్పుడు బీఆర్ ఎస్ ను ప్రవీణ్ విషయంలో ఆరోపించేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. ఎలాగంటే.. గతంలో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ ఎస్ కు బినామీ అనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ప్రవీణ్ కుమార్ ను కూడా కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ పెద్దగా ఎన్నడూ విమర్శించలేదనే వాదన ఉంది. పైగా ప్రవీణ్ కుమార్ కూడా కేసీఆర్ ను ఎన్నడూ నిందించలేదు. ఈ వాదనలను నిజం చేస్తూ ఇప్పుడు ప్రవీణ్ కుమార్ వెళ్లి బీఆర్ ఎస్ లో జాయిన్ అయ్యారు. దీంతో ప్రవీణ్ కుమార్ నిజంగానే కేసీఆర్ బినామీ కాబట్టి వెళ్లి బీఆర్ ఎస్ లో జాయిన్ అయ్యారని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆరోపించడానికి రెడీ అవుతోంది.
కేసీఆర్ అవినీతి బయటపడుతుండటంతో ఎక్కడ తన మీదకు వస్తుందో అనే కారణంతో ప్రవీణ్ కుమార్ ఉన్న ఫలంగా బీఎస్పీ అధినేత పదవికి రాజీనామా చేసి మరీ కేసీఆర్ పార్టీలో జాయిన్ అయ్యారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇదే విషయంలో రేవంత్ రెడ్డి కూడీ సీరియస్ గా ఉన్నారంట.
రేవంత్ ఆఫర్ ఇస్తే వద్దని బీఆర్ ఎస్ లో చేరినట్టు ప్రవీణ్ కుమార్ చెబుతున్నారు. దాంతో ఈ విషయంపై రేవంత్ కూడా సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నారంట. త్వరలోనే ప్రవీణ్ కుమార్ కు బీఆర్ ఎస్ కు పాత లింకులను బయటకు లాగేందుకు రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.




