Congress : కేటీఆర్ విమర్శలకు కౌంటర్ ఎటాక్ ఇస్తున్న కాంగ్రెస్..!

Qubetvnews - March 8, 2024 / 09:10 AM IST

Congress  : కేటీఆర్ విమర్శలకు కౌంటర్ ఎటాక్ ఇస్తున్న కాంగ్రెస్..!

Congress : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు రాజకీయాలు సాగుతున్నాయి. అంతే తప్ప కాంగ్రెస్ నేతలు పెద్దగా బీజేపీని విమర్శించట్లేదు. కేవలం బీఆర్ ఎస్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇటు బీఆర్ ఎస్ నేతలు కూడా అంతే. కేవలం కాంగ్రెస్ ను మాత్రమే టార్గెట్ చేసుకుంటూ విమర్శలు గుప్పిస్తున్నారు తప్ప బీజేపీని పెద్దగా పట్టించుకున్నట్టు అనిపించట్లేదు. ఇందులో భాగంగా కేటీఆర్ పదే పదే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. మొన్న నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా నరేంద్రమోడీ పక్కనే సీఎం రేవంత్ రెడ్డి స్టేజిపై కూర్చున్నారు. ఇద్దరూ ఏదో మాట్లాడుకున్నారు కూడా. ఇక రేవంత్ రెడ్డి స్పీచ్ ఇచ్చే క్రమంలో నరేంద్ర మోడీ తనకు పెద్దన్న లాంటి వాడని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా మోడీపై ప్రశంసలు కురిపించారు. ఇక మోడీ వెళ్లేటప్పుడు ఎయిర్ పోర్టుకు వెళ్లి మరీ ఆయనకు ప్రతిమ అందజేశారు. ఘనంగా సెండాఫ్ ఇచ్చారు రేవంత్. దాంతో కేటీఆర్ ఈ వ్యవహారంపై తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి మోడీని పొగడటం అంటే రాహుల్ గాంధీ పనికిమాలిన వాడని విమర్శించినట్టే అని చెప్పారు. ఎంపీ ఎన్నికల తర్వాత రేవంత్ వెళ్లి బీజేపీలో జాయిన్ అవుతాడని చెప్పుకొచ్చారు.

అక్కడితో ఆగకుండా మోడీ కాళ్ల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారని చెప్పుకొచ్చారు కేటీఆర్. దాంతో ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా ఫుల్ సీరియస్ గా ఉంది. ఆ వ్యాఖ్యలపై రేవంత్ కూడా కౌంటర్ ఇచ్చారు. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి కాబట్టి అందరికీ పెద్దన్న లాంటి వాడని చెప్పాను అందులో తప్పేముంది అంటూ కవర్ చేశారు. కాగా కాంగ్రెస్ నేతలు, తన మద్దతుదారులతో రేవంత్ ఇప్పుడు కేటీఆర్ కు కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ కూడా నరేంద్రమోడీని ప్రశంసించిన ఘటనలు గుర్తు చేస్తున్నారు.

అప్పుడు కేసీఆర్ పొగిడాడు అంటే.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కూడా తాకట్టు పెట్టినట్టేనా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మీకు అవసరం ఉన్నప్పుడు పొగుడుతారు.. ఇతరులు ప్రశంసిస్తే మాత్రం దాన్ని ఆత్మగౌరవానికి తాకట్టు పెడుతారా అంటూ కాంగ్రెస్ నేతలు కౌంటర్లు వేస్తున్నారు.

మొత్తానికి ఈ విషయంలో కేటీఆర్ మళ్లీ రీ కౌంటర్ ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయే విధంగానే కౌంటర్లు వేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఏదేమైనా ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన కౌంటర్ గట్టిగానే తగులుతోందని చెబుతున్నారు రాజకీయ నిపుణులు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News