Kishan Reddy : ఓటమి భయంతో రేవంత్‌ రెడ్డి తొండాట : కిషన్ రెడ్డి

Qubetvnews - May 2, 2024 / 10:55 AM IST

Kishan Reddy : ఓటమి భయంతో రేవంత్‌ రెడ్డి తొండాట : కిషన్ రెడ్డి

Kishan Reddy :

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజక వర్గం నుంచి బీజేపీ తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీకి దిగిన విషయం తెల్సిందే. సిట్టింగ్‌ ఎంపీ సీటును దక్కించుకునేందుకు కిషన్ రెడ్డి చాలా కష్టపడుతున్నారు. తాను నియోజక వర్గంకు చేసిన అభివృద్ది కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారంలో దూసుకు పోతున్నారు. సికింద్రాబాద్‌ లో కిషన్ రెడ్డికి మద్దతుగా పలువురు కేంద్ర మంత్రులు మరియు జాతీయ అధ్యక్షుడు నడ్డా తో పాటు పలువురు ముఖ్య నాయకులు ప్రచారం చేస్తున్నారు. ప్రచారం ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో కిషన్ రెడ్డి స్పీడ్‌ పెంచారు. ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో మాటల యుద్దంకు దిగుతున్న కిషన్‌ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కిషన్ రెడ్డి ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ… పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచేది బీజేపీనే అన్నారు. బీజేపీకి ప్రజా మద్ధతు రోజు రోజుకీ పెరుగుతోందన్నారు. ఓటమి భయంతో రేవంత్‌, కేసీఆర్‌ తొండాట ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తున్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. రేవంత్‌ మాటలను ఇప్పుడు తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు. దేశానికి సంబంధించిన ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు పట్టించుకోరన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, మోదీకే ఓటు వేస్తామని రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో ప్రజలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు అన్నారు.

ఈ ఎన్నికలు అనేవి ఆలోచనల మధ్య యుద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరెక్ట్‌గా చెప్పారు. ఈ ఆలోచనలే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ లోక్‌సభ ఎన్నికలు తెలంగాణ ప్రజలకు అత్యంత కీలకం.. ఆ విషయం ఓటర్లకు కూడా తెలుసు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే జరిగే పరిస్థితి ఏంటి అనేది ఇప్పటికే అనుభవంలోకి వచ్చిన తెలంగాణ ప్రజలు రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల విషయంలో ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటారనే నమ్మకంను కిషన్ రెడ్డి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే రాజ్యాంగేతర మతపరమైన రిజర్వేషన్ లు అమలు చేస్తారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మతపరమైన రిజర్వేషన్ లను కాంగ్రెస్ అమలు చేస్తుంది. దాంతో బీసీలకు అన్యాయం జరుగుతుంది. కనుక కిషన్ రెడ్డి కి ఓటు వేసి బీజేపీని గెలిపించుద్దాం అంటూ ప్రజలు నిర్ణయానికి వచ్చారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News