Kishan Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సంచలన బహిరంగ లేఖ

Qubetvnews - May 5, 2024 / 10:00 AM IST

Kishan Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సంచలన బహిరంగ లేఖ

Kishan Reddy :

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మోదీ ప్రభుత్వం ఈ పదేళ్ల కాలంలో తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందంటూ రేవంత్‌ తన ప్రచార సభలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి ధీటుగా స్పందించారు. పదేళ్ల యూపీఏ హయాంలో తెలంగాణకు ఎంత ఇచ్చారు? పదేళ్ల ఎన్డీయే హయాంలో ఎంత ఇచ్చాం? అనే విషయాలను తేల్చుకుందామని ఆ లేఖలో సవాల్‌ విసిరారు. రేవంత్ రెడ్డి కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాసిన బహిరంగ లేఖ ఎన్నికల్లో మరింత వేడిని రగిలిస్తోంది. నాడు యూపీఏ, నేడు ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు రావాలంటూ కిషన్ రెడ్డి సవాల్‌ విసిరారు. అమరవీరుల స్థూపం దగ్గరైనా.. కోడంగల్‌లోనా, కృష్ణ గోదావరి నది ఒడ్డునైనా సరే.. చర్చకు తాను సిద్దం అంటూ కిషన్‌ రెడ్డి లేఖ లో పేర్కొన్నారు.

మోడీ ప్రభుత్వం పదేళ్లలో తెలంగాణకు రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను తాము లెక్కలతో సహా నిరూపిస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చారు, ఎంత ఖర్చు పెట్టారో రేవంత్‌రెడ్డి చెప్పాలని కిషన్ రెడ్డి చర్చకు రావాలని కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు ఇచ్చిన నిధులెన్నో తాను చర్చకు వస్తానని అన్నారు. జాతీయ రహదారులు, రైల్వే నెట్‌వర్క్ రైతుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వంటి వాటిలో మోదీ ఏం చేశారో తాను వివరిస్తానని, కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో చర్చలో రేవంత్ రెడ్డి జనాలకు చెప్పాలని కిషన్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

Kishan Reddy Letter To CM Revanth Reddy

Kishan Reddy Letter To CM Revanth Reddy

మరో వైపు సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ అభ్యర్థిగా నిలిచిన కిషన్ రెడ్డి గెలుపు కోసం పార్టీ ముఖ్య నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మొదటి సారి కిషన్ రెడ్డి తనయుడు తన్మయ్‌ రెడ్డి ప్రచారం నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నియోజకవర్గం వ్యాప్తంగా విస్తృతంగా తన్మయ్‌ ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి నిర్వహించిన ప్రచారంలో భాగంగా తన్మయ్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ హయాంలో ప్రపంచంలోనే భారత్ స్ట్రాంగ్‌గా మారిందని అన్నారు.

బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని ప్రకటించారు. సికింద్రబాద్‌లో నా తండ్రి కిషన్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యువతకు కీలక పిలుపు ఇచ్చారు. ‘ఓటు హక్కు అందరి బాధ్యత అని.. యువత తప్పక వినియోగించుకోవాలి’ అని తన్మయ్‌ పిలుపునిచ్చారు. బీజేపీ శ్రేణులతో పాటు జనాలు తన్మయ్ రోడ్ షో కి భారీగా హాజరు అయ్యారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News