Kishan Reddy : బీజేపీ గురించి మాట్లాడే హక్కు కేసీఆర్‌ కు లేదు: కిషన్ రెడ్డి

Qubetvnews - April 25, 2024 / 09:51 AM IST

Kishan Reddy : బీజేపీ గురించి మాట్లాడే హక్కు కేసీఆర్‌ కు లేదు: కిషన్ రెడ్డి

Kishan Reddy :

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ కి ఒక్కటి లేదా జీరో సీట్లు అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించాడు. బీజేపీ పై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు కిషన్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించాడు. అంతే కాకుండా సికింద్రబాద్‌ అభివృద్ది కోసం మొత్తం ఖర్చు చేస్తాను అంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నాడు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు అంటూ కేసీఆర్‌ ఏవో కాకి లెక్కలు చెప్పాడు. కేసీఆర్‌ వ్యాఖ్యలపై మంత్రి కిషన్‌ రెడ్డి సీరియస్‌ గా స్పందించాడు. దేశ వ్యాప్తంగా సికింద్ర బాద్‌ నియోజక వర్గం ని దేశంలోనే నెంబర్‌ 1 గా నిలవడం ఖాయం అని కిషన్‌ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశాడు.

సికింద్రబాద్‌ లో ఎక్కడ ఉన్నా కూడా అభివృద్ది పనులతో బిజీ అయ్యాం అంటూ కిషన్ రెడ్డి చెప్పుకొచ్చాడు. బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావడంతో పాటు సౌత్‌ లో కూడా గతంతో పోల్చితే భారీ ఓట్ల శాతం దక్కే అవకాశం ఉందని కిషన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News