Nara Lokesh : లోకేష్ ను పక్కన పెట్టేసిన చంద్రబాబు.. పవన్ షరతు పెట్టాడా..?
Qubetvnews - February 17, 2024 / 11:10 AM IST
Nara Lokesh :
అసలు లోకేష్ ఎక్కడ.. అనే ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. యువగళం పాదయాత్ర ముగింపు సభ తర్వాత లోకేష్ ఇప్పటి వరకు పెద్దగా బయట కనిపించట్లేదు. ఇప్పటి వరకు ఆయన పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనట్లేదు. అయితే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు నానా హంగామా చేసిన లోకేష్.. ఇప్పుడు చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. మరీ ముఖ్యంగా ఇప్పుడు జనసేన-టీడీపీ మధ్య సీట్ల పంపకాలు జరిపే విషయంలో చంద్రబాబు, పవన్ వరుసగా భేటీ అవుతున్నారు. కానీ ఈ భేటీలో ఎక్కడా కూడా లోకేష్ కనిపించట్లేదు.
పైగా సీట్ల పంపకాల విషయంలో ఇదే చివరి భేటీ అని కూడా చెబుతున్నారు. మరి ఇంతటి కీలక మైన భేటీలో లోకేష్ ఎందుకు కనిపించట్లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనంతటికీ కారణాలు కూడా చాలానే ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఆ నడుమ లోకేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తండ్రి చంద్రబాబే సీఎం అవుతారని చెప్పారు. అంతే కాకుండా పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే విషయంపై కూడా అందరు కలిసి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. దాంతో ఈ మాటలపై జనసేన నేతలు చాలా ఆగ్రహంగా ఉన్నారు.
పవన్ కల్యాణ్ కూడా లోకేష్ వ్యాఖ్యలను బహిరంగంగానే ప్రస్తావించారు. పొత్తు ధర్మాలు పాటించట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు జనసనతో పొత్తులు పెట్టుకోవడమే లోకేష్ కు ఇష్టం లేదని మొదటి నుంచి టీడీపీ నేతలు చెబుతున్నారు. జనసేనకు సీట్లు ఇవ్వడం వల్ల మూడో ప్రత్యామ్నాయానికి మనమే ఆజ్యం పోసినట్టు అవుతుందని లోకేష్ చెప్పారంట. అంతే కాకుండా మనల్ని నమ్ముకున్న టీడీపీ నేతలకు ఎందుకు అన్యాయం చేసి జనసేనకు టికెట్లు ఇవ్వాలంటూ చాలా సార్లు చంద్రబాబు ముందు లోకేష్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
ఈ విషయాలు పవన్ వద్దకు వెళ్లాయంట. అందుకే లోకేష్ మన భేటీలో ఉండొద్దని పవనే స్వయంగా షరతు పెట్టినట్టు తెలుస్తోంది. కానీ అసలు జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలనే దానిపై ఇప్పటికే లోకేష్, చంద్రబాబు మధ్య రెండుసార్లు చర్చలు జరిగాయని.. కాబట్టి లోకేష్ చెప్పినన్నే సీట్లు ఇస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
లోకేష్ తమ భేటీలో ఉంటే ఆయన మరిన్ని తక్కువ సీట్లు ఇచ్చేలా మాట్లాడే అవకాశాలు ఉంటాయనేది పవన్ భయం. అందుకే లోకేష్ ను భేటీలో లేకుండా చూసుకున్నారు. కానీ చంద్రబాబు ఎలాంటి హామీ ఇచ్చినా సరే లోకేష్ ను అడిగే చేస్తారని అంటున్నారు టీడీపీ నేతలు.




