CM Revanth Reddy : తన ఓటమి అప్పుడే అంటున్న రేవంత్.. అనవసరంగా స్టేట్ మెంట్ ఇచ్చాడా..?

Qubetvnews - February 22, 2024 / 11:18 AM IST

CM Revanth Reddy : తన ఓటమి అప్పుడే అంటున్న రేవంత్.. అనవసరంగా స్టేట్ మెంట్ ఇచ్చాడా..?

CM Revanth Reddy :

రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత దూకుడుగా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. కానీ ఆయన సీఎం అయిన తర్వాత మాత్రం ప్రతి విషయలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఏ మాత్రం నోరు జారకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రతి విషయంలో ప్రతిపక్షాలకు కౌంటర్ వేసేందుకు గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ ఎస్ వైపల్యాలను ఎండగట్టేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న ప్రయత్నాలు కూడా బాగానే సక్సెస్ అవుతున్నాయి.

కాగా రేవంత్ రెడ్డి ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితం అయిన ఆయన చరిష్మా ఇప్పునడు అన్ని వర్గాలకు చేరుకుంటోంది. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి చేసిన తాజా కామెంట్లు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతున్నాయి. ప్రస్తుతం ఎంపీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డికే ఎంపీ ఎన్నికల బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. దాంతో రేవంత్ రెడ్డి కూడా ఎంపీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికను రెడీ చేసే పనిలో ఉన్నారు. దాంతో పాటు ఎన్నికలకు అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు.

మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కనీసం 12 లేదా 14 సీట్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే తాజాగా కొడంగల్ పర్యటనకు రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆయన అక్కడ చాలా పనులకు శంకు స్థాపనలు చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వచ్చే ఎంపీ ఎన్నికల్లో కనీసం 14 సీట్లు సాధిస్తేనే మనం గెలిచినట్టు అని చెప్పారు. దాంతో ఈ వ్యాఖ్యలు విన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా ఒకింత షాక్ కు గురయ్యారు. కచ్చితంగా అన్ని సీట్లు కాంగ్రెస్ కు వచ్చే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా అటే లేవనే చెప్పుకోవాలి.

ఎందుకంటే ఇటు బీఆర్ ఎస్ తో పాటు అటు బీజేపీ నుంచి గట్టి పోటీ ఉంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్, బీఆర్ ఎస్ మధ్యనే పోటీ జరిగింది. కానీ ఈ ఎంపీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండబోతోంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. మరి ఇలాంటి పోటీ వాతావరణంలో కాంగ్రెస్ అన్ని సీట్లు సాధిస్తుందనే నమ్మకం అయితే లేదు.

కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు సాధించలేకపోతే ఓడిపోయినట్టే అని ప్రతిపక్షాలు కూడా ప్రచారం చేసే అవకాశాలు ఉంటాయి. పైగా ఎంపీ ఎన్నికల కమిటీ చైర్మన్ గా ఉన్న రేవంత్ రెడ్డినే దీనికి ప్రధాన బాధ్యుడిని చేసే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఇది రేవంత్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందని అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. అనవసరంగా ఆ స్టేట్ మెంట్ ఇచ్చారని.. ఇవ్వకున్నా బాగుండే అని చెబుతున్నారు.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News