CM Revanth Reddy : రేవంత్ ను ఆ విషయంలో టార్గెట్ చేయబోతున్న బీఆర్ఎస్..?

Qubetvnews - February 23, 2024 / 10:57 AM IST

CM Revanth Reddy : రేవంత్ ను ఆ విషయంలో టార్గెట్ చేయబోతున్న బీఆర్ఎస్..?

CM Revanth Reddy :

బీఆర్ ఎస్ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ప్రధానంగా కాంగ్రెస్ ను మాత్రమే టార్గెట్ చేస్తోంది. అందులోనూ రేవంత్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు రేవంత్ చేస్తున్న పనులు కూడా కారణమే అనుకోండి. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి బీఆర్ ఎస్ వైఫల్యాలను ఎండగట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే మేడిగడ్డ బ్యారేజీ సందర్శన, కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేత పత్రం విడుదల ఇలాంటివన్నీ ఇప్పుడు బీఆర్ ఎస్ కు మచ్చగా మారిపోయాయి. దాంతో పాటు అప్పులను కూడా రేవంత్ ఎత్తి చూపించారు.

బీఆర్ఎస్ హయాంలోనే చేసిన అప్పులపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. దాంతో బీఆర్ ఎస్ మీద తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఇలా అన్ని రకాలుగా బీఆర్ ఎస్ మీద ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనేలా వ్యూహాలు రచిస్తున్నారు రేవంత్ రెడ్డి. దాంతో బీఆర్ ఎస్ పార్టీ కూడా రేవంత్ ను ఏ విధంగా అయితే టార్గెట్ చేయొచ్చా అని ఎదురు చూస్తోంది. ఇప్పుడు ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించకపోవడంతో దానిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చిందంటూ బలంగా ప్రచారం చేసుకుంటోంది.

దాంతో పాటు ఇప్పుడు మరో విషయంలో కూడా రేవంత్ ను టార్గెట్ చేయడానికి రెడీ అవుతోంది. బీఆర్ ఎస్ హయాంలో కేటీఆర్, హరీశ్ రావు, కేసీఆర్ ల నియోజకవర్గాలు అయిన సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలకే ఎక్కువ నిధులు తీసుకెళ్తున్నారంటూ అప్పట్లో బీజేపీ బలంగా ప్రచారం చేసింది. వారి నియోజకవర్గాలకు నిధులు తీసుకెళ్లి మిగతా నియోజకవర్గాలను గాలికి వదిలేశారంటూ విమర్శలు చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సీఎం అయిన వెంటనే తన నియోజకవర్గం అయిన కొడంగల్ కు మొన్న రూ.4369 వేల కోట్ల అభివృద్ధి పనులను కేటాయించుకున్నారు.

CM Revanth Reddy Special Focus On Kodangal

CM Revanth Reddy Special Focus On Kodangal

దాంతో ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఈ విషయంలో టార్గెట్ చేసేందుకు రెడీ అవుతోంది బీఆర్ ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి కేవలం తన నియోజకవర్గానికి మాత్రమే డబ్బులు కేటాయించుకుంటున్నాడని.. మిగతా నియోజకవర్గాలను మాత్రం పట్టించుకోవట్లేదని టార్గెట్ చేయడానికి రెడీ అవుతోంది బీఆర్ ఎస్ పార్టీ.

వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఈ విషయంపై నిలదీయడానికి రెడీ అవుతోంది. దాంతో పాటు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాలను కూడా పట్టించుకోవట్లేదని.. కేవలం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి మాత్రమే డబ్బులు కేటాయించుకుంటున్నాడని చెప్పి వారికి వారికే చిచ్చు రేపాలని బీఆర్ ఎస్ ప్లాన్ వేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మరి ఈ ప్లాన్ ను రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కుంటారో చూడాలి.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News