CM Revanth Reddy : ఒకే దెబ్బతో రెండు పార్టీలను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..!

Qubetvnews - February 24, 2024 / 09:33 AM IST

CM Revanth Reddy : ఒకే దెబ్బతో రెండు పార్టీలను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..!

CM Revanth Reddy :

రేవంత్ రెడ్డి వ్యూహాలు నిజంగానే ఎవరికీ అంతు చిక్కట్లేదు. ఆయన వేస్తున్న ఎత్తుగడలు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు కూడా అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ను ప్రజలకు దగ్గర చేయడంతో పాటు బీఆర్ ఎస్, బీజేపీల మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ఆయన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కూలిపోవడాన్ని ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ కు పదేండ్ల కాలంలో గొప్పగా చెప్పుకునే ప్రాజెక్టుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలను, వైఫల్యాలను బయట పెట్టేస్తున్నారు రేవంత్ రెడ్డి.

దాని వల్ల ముందుగా బీఆర్ ఎస్ మీద ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతింటుందని.. ఆ తర్వాత కాంగ్రెస్ మీద ప్రజలకు నమ్మకం పెంచేవిధంగా పనులు చేపట్టాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే మొన్న ఎమ్మెల్యేలను మేడిగడ్డ తీసుకెళ్లి కూలిన పిల్లలను మీడియాకు చూపించారు. దాంతో పాటు అసెంబ్లీలో కూడా మేడిగడ్డ బ్యారేజీ గురించి పెద్ద చర్చనే పెట్టే విధంగా ప్రయత్నాలు చేశారు రేవంత్ రెడ్డి. ఇవన్నీ కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగాయి. దాంతో బీఆర్ ఎస్ మీద చాలానే విమర్శలు కూడా వచ్చాయి. అయితే రేవంత్ రెడ్డి దాన్ని అక్కడితో వదిలిపెట్టాలని అనుకోవట్లేదు.

బీజేపీ, బీఆర్ఎస్ ను ఇంకా టార్గెట్ చేయాలని డిసైడ్అయ్యారు. అందుకే ఇప్పుడు బీజేపీని పదే పదే కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. బీజేపీ ఇన్ని రోజులు కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా కాలేశ్వరం అవినీతిపై ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు విచారణ జరిపించలేదంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి. మొన్న తాము మేడిగడ్డ సందర్శనకు తీసుకెళ్లినా సరే బీజేపీ ఎమ్మెల్యేలు కావాలనే రాలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలోనే తాము సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులతో విచారణ జరిపిస్తామని.. దోషులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

అయితే ఇది ఒకేసారి అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ పార్టీలను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇన్ని రోజులు బీజేపీ కావాలనే బీఆర్ఎస్ ను టార్గెట్ చేయలేదని.. కల్వకుంట ఫ్యామిలీ కాళేశ్వరం పేరుతో దోచుకుంటున్నా సరే ప్రశ్నించలేదని రేవంత్ రెడ్డి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కానీ దానిపై బీజేపీ నేతలు పెద్దగా స్పందించట్లేదు.

అయితే ఇటు బీఆర్ఎస్ మీద న్యాయ విచారణ జరిపిస్తే ఎంతో కొంత కాంగ్రెస్ కు మేలు కాక తప్పదు. అంతే కాకుండా అది బీఆర్ఎస్ కు నష్టం తెచ్చే అంశమే అని చెబుతున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ఆరోపణలు అటు బీజేపీకి, ఇటు బీఆర్ఎస్ కు మింగుడు పడటం లేదు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News