Kishan Reddy : యాత్రలు, ప్రచారాలతో ప్రజలతో మమేకమవుతున్న కిషన్ రెడ్డి, బీజేపీ గెలుపుపై ధీమా………….

Qubetvnews - April 23, 2024 / 06:55 PM IST

Kishan Reddy : యాత్రలు, ప్రచారాలతో ప్రజలతో మమేకమవుతున్న కిషన్ రెడ్డి, బీజేపీ గెలుపుపై ధీమా………….

Kishan Reddy :

సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారంలో బిజీ అయ్యారు కిషన్ రెడ్డి. సోమవారం అంబర్ పేట్ నియోజకవర్గంలోని నల్లకుంట డివిజన్, కాచిగూడ డివిజన్ లో ప్రచారం చేస్తూ జీప్ యాత్ర చేపట్టారు. బీజేపీ జెండాల రెపరెలప మధ్య, అభివాదం చేస్తూ ముందుకు సాగారు కిషన్ రెడ్డి. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో మోడీ అణచివేశారనీ, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో శాంతి నెలకొందని అన్నారు.

Kishan Reddy Busy Campaigning For AmberPet Constituency

Kishan Reddy Busy Campaigning For AmberPet Constituency

జనంలోకి రాని కేసీఆర్ ను ప్రజలు ఫామ్ హౌజుకే పరిమితం చేశారనీ, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకొచ్చాక రేవంత్ రెడ్డి వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామన్నారు. అయిదు నెలలు కావొస్తున్నా, నిరుద్యోగ భ్రుతి గానీ, మహిలలకు ప్రతినెలా 2500 గానీ ఇవ్వలేదెందుకు అని ప్రశ్నించారు.

తెల్ల రేషన్ కార్డులు కొత్తవి అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది గానీ.. ఎమ్మెల్యేగా తాను ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డులే తప్ప, కేసీఆర్ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని సర్కారుపై మండిపడ్డారు. అనంతరం చప్పల్ బజార్లో కార్యకర్తలతో కలిసి చాయ్ తాగి ముచ్చటించారు.

Kishan Reddy Busy Campaigning For AmberPet Constituency

Kishan Reddy Busy Campaigning For AmberPet Constituency

ఆ తర్వాత చేపట్టిన యాత్రలో కార్యకర్తలు పూలు చల్లుతూ, మహిళలు హారతులిస్తూ కిషన్ రెడ్డిని స్వాగతించారు. అక్కడ ప్రచారం ముగిసాక బర్కత్ పురాలోని బీజేపీ సిటీ కార్యాలయంలో పార్టీ మహిళా మోర్చా సభ్యులు, కార్యకర్తలో సమావేశమయ్యారు. తెలంగాణలో మోడీ గ్యారంటీలని సమర్థించడంలో మహిళలు ముందున్నారనీ, మోడీ 3.0 పట్ల మహిళలకున్న నిబద్ధత అభినందనీయం అన్నారు.

సాయంత్రం రామ్ గోపాల్ పేట, మోండా డివిజన్లలో యాత్ర నిర్వహించి గత పదేళ్లలో మోడీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను, చేసిన పనులను వివరించారు. మోడీ నాయకత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారనీ, స్కాములు మాఫియాలను ప్రోత్సహించే కాంగ్రెస్ ని ప్రజలు వ్యతిరేకిస్తున్నానీ తెలిపారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News