CM Revanth Reddy : ముందు వాళ్లు.. తర్వాత ఎమ్మెల్యేలు.. రేవంత్ ప్లాన్ కు బీఆర్ఎస్ షాక్..!
Qubetvnews - February 17, 2024 / 08:41 AM IST
CM Revanth Reddy :
సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా చేయాలనుకుంటే చేసేదాక వదిలపెట్టరు. తనను ఇబ్బంది పెట్టాలని చూస్తే అవతలి వారికి ఝలక్ ఇచ్చేదాకా నిద్రపోనటువంటి వ్యక్తి. మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ తక్కువ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాంతో బీఆర్ ఎస్ వరుసగా లేనిపోని కామెంట్లు చేసింది. కాంగ్రెస్ కు తక్కువ మెజార్టీ ఉదని.. త్వరలోనే ఆ ప్రభుత్వం కూలిపోతుందని.. ఇలా రకరకాల కామెంట్లు చేశారు. దానిపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా సీరియస్ అయ్యారు. తమను ఇబ్బంది పెట్టాలని బీఆర్ ఎస్ చూస్తే.. బీఆర్ ఎస్ ను ఖాళీ చేస్తామని ఇప్పటికే వారు వార్నింగ్ లు ఇస్తున్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి లు అయితే ఓ అడుగు ముందుకు వేసి ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేస్తామని ప్రకటించి సంచలనం రేపారు. అందుకు తగ్గట్టే కొందరు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిశారు. దాంతో వారు కచ్చితంగా పార్టీ మారుతారని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో మీద రేవంత్ రెడ్డి కూడా వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. ప్రజాస్వామ్య బద్దంగా ఎంపికైన ఎమ్మెల్యేలను ఎంపీ ఎన్నికలు ముందే లాగేసుకుంటే కాంగ్రెస్ మీద ప్రభావం పడుతుందని ఆయన ఆలోచిస్తున్నారంట. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే అది ఎంపీ ఎన్నికల్లో దెబ్బ పడే అవకాశం ఉన్నట్టు ఆయన భావించారు.
అందుకే ఎంపీ ఎన్నికలు అయిపోయే వరకు ఏ ఎమ్మెల్యేలను కూడా లాక్కోవద్దని డిసైడ్ అయ్యారు. కానీ ఎమ్మెల్యేలు కాకుండా ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, టికెట్ రాకుండా బీఆర్ ఎస్ లో భంగపడ్డ వారు.. ఇలా ఎవరు గులాబీ పార్టీ నుంచి వచ్చినా సరే ఎంపీ ఎన్నికలకు ముందే లాగేసుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే చాలా మంది పార్టీలు మారేందుకు రెడీగా ఉన్నారని తెలుసుకున్న రేవంత్.. వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారంట. ఇప్పటికే స్వామిగౌడ్, పట్నం మహేందర్ రెడ్డి లాంటి కీలక నేతలు రేవంత్ ను కలిశారు.
వీరితో పాటు మరికొందరు కూడా బీఆర్ ఎస్ ను వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారికి నామినేటెడ్ పదువలు ఇచ్చేందుకు రేవంత్ హామీలు కూడా ఇస్తున్నారు. ఇంకేముంది వారిని చూసి మిగతా వారు కూడా బీఆర్ ఎస్ ను వీడేందుకు రెడీ అయిపోయారు. టికెట్ రాకుండా భంగపడ్డ వారు బీఆర్ఎస్ లో చాలా మందే ఉన్నారు.
అలాంటి వారందరూ ఇప్పుడు కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఇది ఒక రకంగా బీఆర్ ఎస్ కు షాక్ అనే చెప్పుకోవాలి. మొన్నటి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లాగేస్తుందని అనుకుంటే.. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను రేవంత్ రెడ్డి లాగేసే పనిలో పడ్డారు. ఇది కొనసాగితే మాత్రం బీఆర్ ఎస్ కు ఎంపీ ఎన్నికల ముందు భారీ దెబ్బ పడటం ఖాయం అనే చెప్పుకోవాలి.





